గ్రంథశిరిలో విషాద ఛాయలు | Granthasirilo tragic shadow | Sakshi
Sakshi News home page

గ్రంథశిరిలో విషాద ఛాయలు

Jan 26 2015 2:29 AM | Updated on Sep 2 2017 8:15 PM

ఆసరాగా ఉంటారనుకున్న కుమారులు అర్ధంతరంగా మృత్యుఒడికి చేరడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

గ్రంథశిరి (అచ్చంపేట): ఆసరాగా ఉంటారనుకున్న కుమారులు అర్ధంతరంగా మృత్యుఒడికి చేరడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రంథశిరి గ్రామానికి చెందిన బలిజేపల్లి దివ్యరాజు (19) చిలకా కిరణ్‌కుమార్(19, చిలకా కాలేబు ముగ్గురు అన్నాచెల్లిళ్ల సంతానం. ఆదివారం అంబడిపూడిలోని బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు హాజరయ్యారు. మధ్యాహ్నం సరదాగా నదికి వెళ్లివస్తామని బంధువులకు చెప్పి కృష్ణా నదికి వెళ్లారు. దివ్యరాజు, కిరణ్‌కుమార్ ఈత కొట్టేందుకు నదిలో దిగగా, కాలేబు మాత్రము ఒడ్డునే ఉన్నాడు.

ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు కాంట్రాక్టర్లు నదిలో లోతుగా తీసిన గోతుల వద్దకు వెళ్లి వీరిద్దరూ మునిగిపోతూ రక్షించండి అని బిగ్గరగా అరవడంతో కాలేబు నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. సమీపంలోని డింగీ పడవలలో చేపలు పడుతున్నవారు గమనించి రక్షించేందుకు నదిలోకి దూకినా ప్రయోజనం లేకపోయింది. కొద్దిసేపు గాలించి మృత దేహాలను వెలికితీశారు.  

కాలేబు ద్వారా గ్రామంలోని బంధువులకు, వారి ద్వారా తల్లిదండ్రులకు విషయం చేరవేశారు. హుటాహుటిన నది దగ్గరకు వచ్చిన తల్లిదండ్రులు కుమారుల మృతదేహాలను చూసి తల్లఢిల్లిపోయారు. కూలి చేసి కుమారులను చదివించామని, చేతికి అందివచ్చేంతలో ఇలా జరిగిపోయిందంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాలను స్వగ్రామమైన గ్రంథశిరికి తరలించారు.
 
ఇద్దరూ ఇంటికి పెద్ద కుమారులే..
బలిజేపల్లి బాబు, జాన్సీలకు ఇద్దరు సంతానం. అందులో దివ్యరాజు పెద్ద కుమారుడు. ఇంటర్ వరకు చదివి, రెండు సబ్జెక్టులు తప్పడంతో ఆ సబ్టెక్టులు మళ్లీ రాసేందుకు ప్రిపేరవుతున్న తరుణంలో ఈ దారుణం జరిగింది. అలాగే చిలకా మోహనరావు, మార్తమ్మ దంపతులకు ఇరువురు సంతానం. ఇద్దరిలో కిరణ్‌కుమార్ పెద్దవాడు.

ఇంటర్ పూర్తి చేసి టీటీటీ (టీచర్ ట్రైనింగ్ కోర్సు) ఎంట్రన్స్ రాసి సీటు కోసం వేచి ఉన్న తరుణంలో మృత్యువు ఇలా కబళించింది. వీరి తల్లిదండ్రులకు సెంటు భూమిలేదు. కూలిపనే జీవనాధారం. పెద్దకుమారులు చదువుకుని తమకు ఆసరాగా నిలబడతారని కష్టపడి చదివించారు. ఈ దుర్ఘటన జరగడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement