మరో రంగస్థలం

Grama Panchayat Election Weather In Nellore - Sakshi

జిల్లాలోని కుల్లూరు పంచాయతీలో ప్రస్తుతం రంగస్థలం కథ నడుస్తోంది. పంచాయతీ ఎన్నికలు రాక ముందే అక్కడ వాతావరణం వేడెక్కింది. పంచాయతీలో ఓ ప్రజాప్రతినిధి చెప్పిందే వేదం. ఆయన చెప్పినట్లు అధికారులు, ప్రజలు వినాల్సిందే. వినకపోతే వారిపై అవినీతి, అక్రమాల పేరుతో అధికారుల చేత విచారణలు, వేదింపులకు గురి చేస్తున్నాడు. తప్పు చేయకపోయినా.. చేసినట్లు ఆధారాలు లేకపోయినా.. ఏదో ఒక విధంగా చర్యలు తీసుకునేలా అధికారులపై ఒత్తిళ్లు చేయిస్తున్నాడు. ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ప్రజాప్రతినిధి చెప్పినట్లు చేయడం లేదనే అక్కసుతో అతనిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆకాశారామన్న ఫిర్యాదులు తీసుకెళ్లి జిల్లా అధికారులకు అందజేసి విచారణ పేరుతో వేదిస్తున్నారు. అధికారులు కూడా ఆకాశ రామన్న ఫిర్యాదులకు అత్యంత ప్రధాన్యం ఇచ్చి కింది స్థాయి అధికారులతో విచారణలు చేయిస్తున్నారు. విచారణలో ఎలాంటి ఆధారాలు లేదని నివేదికలు అందజేస్తే మరొక ఆకాశ రామన్న ఫిర్యాదు చేసి విచారించి చర్యలు తీసుకోమని ఒత్తిడి తెస్తున్నారు.  

నెల్లూరు(పొగతోట): జిల్లాలోని కలువాయి మండలంలో ఉన్న కుల్లూరు మేజర్‌ పంచాయతీలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి పి.వంశీకృష్ణ ఫీల్డ్‌ అసిస్టెంట్‌(ఎఫ్‌ఏ)గా పని చేస్తూ కూలీలకు పనులు కల్పిస్తున్నాడు. ఉపాధి హామీ పనులు కల్పించడంలో ఈ పంచాయతీ ప్రథమ స్థానంలో ఉండడంతో ఎఫ్‌ఏ వంశీకృష్ణ ఎంపీడీఓ చేతులమీదుగా అవార్డు కూడా అందుకున్నారు. ఉ పాధి కూలీలకు రోజుకు రూ.200లకు పైగా వేత నం మంజూరయ్యేలా పనులు చూపిస్తున్నాడు. ఎఫ్‌ఏ తాను చెప్పినట్లుగా నడుచుకోలేదని ప్రజా ప్రతినిధి ఆకాశ రామన్న ఫిర్యాదులు చేయడం ప్రారంభించాడు. ఇద్దరు, ముగ్గురు కూలీలను రెచ్చగొట్టి ఎఫ్‌ఏపై ఫిర్యాదులు చేయించాడు. కొద్ది రోజుల తరువాత ఫిర్యాదులు చేసిన కూలీలు ఎంపీడీఓ వద్దకు వచ్చి తమకు రాజకీయాలతో సంబంధం లేదని, ఎఫ్‌ఏ తమకు పనులు కల్పిస్తున్నాడని, అతను అక్రమాలకు పాల్పడడం లేదని తెలిపారు.\

తమకు రావాల్సిన వేతనాలు అతను తీసుకోవడం లేదని ఎంపీడీఓకు రాతపూర్వకంగా వివరించారు. అనంతరం ఆ ప్రజాప్రతినిధి కూలీలు కాకుండా పంచాయతీ పాలక సభ్యులతో ఫిర్యాదు చేయించాడు. ఫిర్యాదు అందుకున్న అధికారులు ఆగమేఘాలపై కుల్లూరులో ఈ నెల 18వ తేదీన విచారణ చేపట్టారు. విచారణ సమయంలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. గతంలో ఆధారులు లేని ఫిర్యాదుకు సంబంధించి బ్యాంక్‌ కార్సండెంట్‌ నుంచి కూలీలకు ఇవ్వాల్సిన రూ.1.20 లక్షల నగదు ఎఫ్‌ఏ తీసుకున్నాడని అతనితో రాయించుకుని దీనిపై క్రిమినల్‌ కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఉపాధి పనులు చేసినందుకు బ్యాంక్‌ కార్సండెంట్‌ కూలీలకు వేతనాలు ఇవ్వాల్సిఉంది. దానితో ఎఫ్‌ఏకు ఎలాంటి సంబంధం ఉండదు. చేసిన పనులకు వేతనాలు ఇంత వరకు ఇవ్వలేదని కూలీలు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. ఫిర్యాదులు చేయకుండా బ్యాంక్‌ కార్సండెంట్‌ నుంచి ఎఫ్‌ఏ నగదు తీసుకుపోయడంటే గుడ్డిగా ఏవిధంగా కేసు నమోదు చేసే విషయాన్ని పరిశీలిస్తే పై నుంచి ఏస్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయో అర్థమవుతోంది.

  
అవినీతిని కప్పిపెట్టి..
కుల్లూరు పంచాయతీలో రోడ్లు వేయకుండా రూ.లక్షల బిల్లులు స్వాహా చేసిన పంచాయతీ కార్యదర్శిపై ఎలాంటి విచారణ చేయలేదు. పంటకుంటల బిల్లులు మంజూరు కాగానే వాటిని పూడ్చి వేసి పంటలు సాగు చేస్తున్నా వాటిపై ఎలాంటి విచారణ చేయడం లేదు. పంచాయతీ కార్యదర్శి నిధులు స్వాహా చేశారని జిల్లా అధికారులకు నాలుగు పర్యయాలు ఫిర్యాదులు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి విచారణ చేపట్టలేదు. ఉపాధి టీఏకు రూ.3.50 లక్షల రికవరీ పడితే దానిని రూ.14 వేలకు తగ్గించారు. దీనిపై ఇంత వరకు విచారణ చేయలేదు. అధికారపార్టీ ప్రజాప్రతినిధి కావడంతో అధికారులు ఆయన చెప్పినట్లు చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయిన ఎఫ్‌ఏపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేయడం చేస్తుండడం గమనార్హం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top