తోటి ఉద్యోగి వేధింపులు.. పంచాయతీ కార్యదర్శి రాజశ్రీ ఆత్మహత్య | Panchayat Secretary RajaSri Ends Life In Mahabubnagar District | Sakshi
Sakshi News home page

తోటి ఉద్యోగి వేధింపులు.. పంచాయతీ కార్యదర్శి రాజశ్రీ ఆత్మహత్య

Oct 29 2025 10:46 AM | Updated on Oct 29 2025 12:44 PM

Panchayat Secretary RajaSri Ends Life In Mahabubnagar District

మహబూబ్ నగర్ జిల్లా: సహచర ఉద్యోగి నుంచి వస్తున్న లైగింక వేధింపులు తట్టుకోలేక మిడ్జిల్‌ మండలంలోని వెలుగొమ్ముల పంచాయతీ కార్యదర్శి రాజశ్రీ (33) ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. సీఐ కమలాకర్‌ కథనం మేరకు.. అడ్డాకుల మండలంలోని పొన్నకల్‌ గ్రామానికి చెందిన బండారు రాజశ్రీకి 2016లో నారాయణపేటకు చెందిన నీలి శ్యాంసుందర్‌తో వివాహం జరిగింది. 

వీరికి కుమార్తె మిథున, కుమారుడు ప్రీతమ్‌నందన్‌ ఉన్నారు. రాజశ్రీ మిడ్జిల్‌ మండలంలోని వెలుగొమ్ముల పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండడంతో వారు జడ్చర్ల పట్టణంలోని శ్రీవేంకటేశ్వర కాలనీలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. జడ్చర్ల బాలాజీనగర్‌కు చెందిన శ్రావణ్‌ మిడ్జిల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. శ్రావణ్‌ కొంతకాలంగా రాజశ్రీని మానసిక, శారీరక వేధింపులకు గురిచేస్తున్నాడు. తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని శ్రావణ్‌ అనేకసార్లు రాజశ్రీపై ఒత్తిడి తీసుకొచ్చాడు.

 ఈ విషయాన్ని రాజశ్రీ భర్త, కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకొచ్చింది. దీంతో వారు శ్రావణ్‌ను మందలించినా మార్పు రాకపోవడంతో పాటు వేధింపులు తీవ్రం చేశాడు. దీంతో తమ కుమార్తె బలవన్మరణానికి పాల్పడిందని రాజశ్రీ తండ్రి బండారి రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు శ్రావణ్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మంగళవారం బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించామన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement