ఆ ఇద్దరికి స్వగ్రామాల్లో చుక్కెదురు! | - | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరికి స్వగ్రామాల్లో చుక్కెదురు!

Dec 15 2025 1:06 PM | Updated on Dec 15 2025 1:06 PM

ఆ ఇద్దరికి స్వగ్రామాల్లో చుక్కెదురు!

ఆ ఇద్దరికి స్వగ్రామాల్లో చుక్కెదురు!

దమగ్నాపురంలో ఎమ్మెల్యే జీఎమ్మార్‌కు షాక్‌

120 ఓట్ల మెజార్టీతో బీఆర్‌ఎస్‌ మద్దతుదారు విజయం

ధన్వాడలో కోడలు ఎమ్మెల్యే పర్ణికారెడ్డిపై అత్త ఎంపీ డీకే అరుణదే పైచేయి..

617 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ మద్దతుదారుపై బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపు

నాగర్‌కర్నూల్‌లోని సొంతూరు తూడుకుర్తిలో పట్టు నిలుపుకున్న ‘కూచుకుళ్ల’

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు ‘అధికార’ ప్రజాప్రతినిధులకు వారివారి స్వగ్రామాల్లో చుక్కెదురైంది. కాంగ్రెస్‌కు చెందిన దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి సొంతూరు చిన్నచింతకుంట మండలం దమగ్నాపురంలో బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థి పంచాయతీ పీఠాన్ని దక్కించుకున్నారు. బీజేపీ నాయకురాలు మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ, కాంగ్రెస్‌కు చెందిన నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అత్తాకోడళ్లు కాగా.. కోడలిపై అత్త పైచేయి సాధించారు. వారి పుట్టినిళ్లు అయిన ధన్వాడలో సర్పంచ్‌గా ‘కమలం’ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. ఇదిలా ఉండగా.. నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, ఆయన తండ్రి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి స్వగ్రామం తూడుకుర్తిలో వారు పట్టు నిలుపుకున్నారు.

ఎక్కడెక్కడ.. ఎలా అంటే..

● దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి స్వగ్రామం దమగ్నాపూర్‌లో మొత్తం 1,704 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థి భారతమ్మకు 640 ఓట్లు రాగా.. బీఆర్‌ఎస్‌ మద్దతుదారు ఇ.పావనికి 760 ఓట్లు వచ్చాయి. 120 ఓట్ల మెజార్టీతో పావని గెలుపొందారు.

● ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి సొంతూరు ధన్వాడలో సర్పంచ్‌ పదవికి 6,250 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ మద్దతుదారు పంది జ్యోతికి 3,287 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌ బలపరిచిన చిట్టెం జ్యోతికి 2,670 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ మద్దతుదారు శ్రీదేవికి కేవలం 249 ఓట్లు పోలయ్యాయి. తన సమీప ప్రత్యర్థి చిట్టెం జ్యోతిపై పంది జ్యోతి 617 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

● నాగర్‌కర్నూల్‌లో కూచు కుళ్ల స్వగ్రామమైన తూడుకుర్తిలో 4,074 ఓట్లు పోలయ్యాయి. కూచుకుళ్ల దామో దర్‌రెడ్డి అనుచరుడైన కాంగ్రె స్‌ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థి లక్ష్మికి 2,045 ఓట్లు రాగా.. బీఆర్‌ఎస్‌ మద్దతుదారు విమలకు 1,810, బీఎస్పీ బలపరిచిన అభ్యర్థికి 179, నోటాకు 40 ఓట్లు పడ్డాయి. 235 ఓట్లతో లక్ష్మి తన సమీప ప్రత్యర్థి విమలపై గెలుపొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement