మిథ్య.. కంప్యూటర్ విద్య | Government negligence on Computer education | Sakshi
Sakshi News home page

మిథ్య.. కంప్యూటర్ విద్య

Nov 10 2013 4:28 AM | Updated on Jun 4 2019 6:45 PM

జిల్లాలోని 140 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్య అందిస్తున్న ఎడ్ కామ్ ఏజెన్సీతో 56 రోజులక్రితం సర్కార్ ఒప్పందం రద్దు చేసింది.

సాక్షి, మంచిర్యాల :  జిల్లాలోని 140 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్య అందిస్తున్న ఎడ్ కామ్ ఏజెన్సీతో 56 రోజులక్రితం సర్కార్ ఒప్పందం రద్దు చేసింది. మరో ఏజెన్సీకి కాంట్రాక్టు ఇవ్వా ల్సి ఉండగా నిర్లక్ష్యంగా ఏమీపట్టనట్లు చేతులుదులుపుకుంది. రద్దు సమయంలో కంప్యూటర్ బోధన బాధ్యతలు ఉపాధ్యాయులకు అప్పగిస్తామని హామీఇచ్చింది. ఇప్పటికీ ఏ ఒక్క పాఠశాలలో బాధ్యతలు అప్పగించిన పాపాన పోలేదు. కంప్యూటర్ విద్య అందుతుందని విద్యార్థులు ఎ దురుచూస్తున్నా సర్కార్ నుంచి స్పందన కరువైంది. దీంతో కొందరు హెచ్‌ఎంలు ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే కం ప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఉపాధ్యాయులు లేకపోవడంతో సమస్య జటిలం అవుతోంది. పాఠా లు చెప్పలేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో దాదాపు అన్ని పాఠశాలల్లో కంప్యూటర్ విద్యకు బ్రేక్‌పడింది.
 వృథాగా కంప్యూటర్ పరికరాలు
 జిల్లాలోని 140 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 2007 నుంచే కంప్యూటర్ విద్య అమలవుతోంది. మొదట్లో నిర్వహణ బాధ్యతను ఎడ్‌కామ్ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. రెండో విడతగా ‘నిట్’ సంస్థకు 30 స్కూళ్లలో అప్పగించింది. మొత్తం 170 పాఠశాలలకు పది చొప్పున 1,700 కంప్యూటర్లు సమకూర్చిం ది. సదరు సంస్థలు ఒక్కో స్కూలుకు ఇద్దరి చొ ప్పున మొత్తం 340 కంప్యూటర్  శిక్షకులను నియ మించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 15న ఎడ్‌కామ్ సంస్థతో ప్రభుత్వానికి ఒప్పందం గడువు పూర్తయింది. దీంతో  ప్రభుత్వం ఒప్పందం రద్దు చేసుకుంది. సంస్థ ఆయా ప్రధానోపాధ్యాయులకు 140 పాఠశాలల్లోని కంప్యూటర్లు అప్పగించాల్సి ఉండగా అలా చేయకుండా తప్పిం చుకు తిరుగుతోంది. పరికరాలు పాడవుతున్నా యి. ఒక్కో కంప్యూటర్ విలువ రూ. 25 వేల వరకు ఉంది. 140 కంప్యూటర్లలో సుమారు 80 కంప్యూటర్లు పాడైనట్లు హెచ్‌ఎంలు విద్యాశాఖ కు నివేదించినట్లు సమాచారం. వీటి విలువ రూ. 20లక్షల వరకు ఉంటుంది. వాటిని బాగు చేయిస్తే తప్ప మళ్లీ పాఠాలు చెప్పలేని పరిస్థితి ఉందని మంచిర్యాలలోని జెడ్పీ బాలికల ఉ న్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్వామిరె డ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒప్పందాన్ని పొడిగించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు వి నతిపత్రం అందించామని మళ్లీ సమాచారం లేదన్నారు.
 చర్యలు తీసుకుంటున్నాం
 - అక్రముల్లాఖాన్, డీఈవో  

 కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఉపాధ్యాయులతో ఆయా స్కూళ్లలో బోధన కొనసాగించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించాం. గతేడాది కొందరు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చాం. వారితో తరగతులు కొనసాగించాల్సిన బాధ్యత హెచ్‌ఎంలదే. బోధకులు లేని స్కూళ్లలో ఉపాధ్యాయులను నియమిస్తాం. ఇప్పటికే చర్యలు ప్రారంభించాం.    

Advertisement
 
Advertisement
Advertisement