80 శాతం పోలింగ్‌ నమోదయ్యే అవకాశం: ద్వివేదీ

Gopalakrishna Dwivedi Press Meet Over Polling - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 80 శాతం పోలింగ్‌ నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు. కాసేపటి క్రితం ద్వివేదీ మీడియాతో మాట్లాడుతూ.. ‘సాయంత్రం 5 గంటల వరకు ఏపీలో 65.96 శాతం పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఉండటంతో.. ఇంకా కొన్ని బూత్‌లలో పోలింగ్‌ కొనసాగుతుంది. అందువల్ల 80 శాతం పోలింగ్‌ నమోదయ్యే అవకాశం ఉంది. పోలింగ్‌ శాతం లెక్కించడానికి మరి కాస్త సమయం పడుతుంది.  

స్వల్ప ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 25 ఘర్షణలు చోటుచేసుక్నుట్టు పోలీసు శాఖ తెలిపింది. ఆరు చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేశారు. ఆ ఘటనల్లో ఇద్దర మరణించగా, కొందరు గాయపడ్డారు. కొన్ని చోట్ల రాజకీయ పార్టీల నుంచి రీపోలింగ్‌కు ఫిర్యాదులు వచ్చాయి. రీపోలింగ్‌ గురించి కేంద్ర ఎన్నికల సంఘంతో చర్చించాను. కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుల స్క్రూటీని అనంతరం రీపోలింగ్‌పై నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఫారం 17(ఏ) పరిశీలించి రీ పోలింగ్ చేయాలా వద్దా అన్నది వారు నిర్ణయిస్తారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో మూడు గంటలకే పోలింగ్‌ ఆగిపోయింద’ని పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top