పట్టాలు తప్పిన గూడ్స్.. తప్పిన ప్రమాదం | goods train skips railway line at rajahmandri | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన గూడ్స్.. తప్పిన ప్రమాదం

May 24 2015 5:15 PM | Updated on Sep 3 2017 2:37 AM

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.

రాజమండ్రి: కొద్దిలో పెను ప్రమాదం తప్పింది. తూర్పుగోదావరి  జిల్లా రాజమండ్రి సమీపంలో  రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై గూడ్స్  రైలు పట్టాలు తప్పింది. కాకినాడ నుంచి ఔరంగాబాద్కు  గూడ్స్ వెళ్తుండగా రాజమండ్రి -కోవూరు మధ్య ఈ ప్రమాదం జరిగింది.  ఎలాంటి ప్రమాదం  జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాజమండ్రి మీదుగా వెళ్లే రైళ్లను దారి మళ్లించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement