పట్టుబడిన బంగారం టీటీడీదేనా? | Is The Gold Seized In Tamilanadu Belongs To TTD | Sakshi
Sakshi News home page

పట్టుబడిన బంగారం టీటీడీదేనా?

Apr 21 2019 6:54 PM | Updated on Apr 21 2019 7:37 PM

Is The Gold Seized In Tamilanadu Belongs To TTD - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తిరుమల: ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో తమిళనాడులో పట్టుబడిన 1381 కేజీల బంగారం టీటీడీదేనా కాదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బంగారం తరలిస్తోన్న సమయంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ అధికారులు తగిన ఆధారాలు చూపకపోవడంతో ఎన్నికల అధికారులు సీజ్‌ చేసిన సంగతి తెల్సిందే. రూ.400 కోట్ల విలువ చేసే బంగారం నలుగురు వ్యక్తులు తీసుకువెళ్లడం వెనక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కనీస భద్రత కూడా లేకుండా శ్రీవారి బంగారం తరలించడంతో ఈ అనుమానాలకు మరింత ఊతమిస్తోంది.  ఈ బంగారం విషయంపై మొదట టీటీడీ ఈవోను ప్రశ్నించగా తనకేమీ తెలియదనంతో మరింత అనుమానం పెరిగింది.



బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం, టీటీడీ అధికారుల ఉత్సాహం వెనక పెద్ద స్కాం ఉందని రాజకీయ నాయకులు, పీఠాధిపతులు సందేహాలు వెలిబుచ్చుతున్నారు. చెన్నైలో ఎన్నికల అధికారులు సీజ్‌ చేసిన 1381 కేజీల బంగారం చివరికి టీటీడీకి చెందినదిగా గుర్తించారు. రూ.50 లక్షలకు మించితే బ్యాంకు సెక్యూరిటీతో పాటు పోలీస్‌ భద్రత తప్పనిసరి అని నిబంధనలు చెబుతున్నాయి. కానీ కనీస భద్రత లేకుండా, ఆధారాలు లేకుండా ఎలా తీసుకెళ్లారని టీటీడీ మాజీ సభ్యుడు భాను ప్రకాశ్‌ ప్రశ్న లేవనెత్తారు. ఈ విషయం గురించి కేంద్ర ఆర్ధిక శాఖకు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement