ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఓ పసికందు మృతి వివాదాస్పదమైంది. వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ ప్రాణం తీసిందని తల్లిదండ్రులు ఆరోపించారు. తల్లిదండ్రుల అవగాహన లోపమే ప్రాణం పోవడానికి కారణమని వైద్యులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఓ పసికందు మృతి వివాదాస్పదమైంది. వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ ప్రాణం తీసిందని తల్లిదండ్రులు ఆరోపించారు. తల్లిదండ్రుల అవగాహన లోపమే ప్రాణం పోవడానికి కారణమని వైద్యులు పేర్కొంటున్నారు.
అనంతపురం రూరల్ :నగరంలోని మరువకొమ్మ కాలనీకి చెందిన మహబూబ్‌బాష, అయిషా తమ మూడు నెలల బాలుడు ఏడుస్తున్నాడని ప్రభుత్వ సర్వజనాస్పత్రికి గురువారం తెల్లవారు జామున నాలుగు గంటలకు తీసుకెళ్లారు. చిన్నారికి గురువారం రాణినగర్ ఎంసీహెచ్ సెంటర్లో బీపీటీ టీకా వేరుుంచామని, అప్పటి నుంచి ఏడుస్తోందని వైద్యులకు తెలిపారు. బిడ్డను పరిశీలించిన డాక్టర్ హేమలత పారాసిట్‌మాల్ సిరప్, ఓ ఆరుుల్‌మెంట్ రాసి ఇవ్వాలని హౌస్ సర్జన్‌ను ఆదేశించారు. వైద్యులు ఇచ్చిన సిరప్ తీసుకుని 4.15 నిమిషాలకు బిడ్డతో సహ వారు బయటకు బయలుదేరారు. మళ్లీ బాలుడు ఏడవడంతో ఆస్పత్రిలోని పిల్లల వార్డుకు తీసుకెళ్లారు. దీంతో వైద్యురాలు హేమలత అడ్మిషన్‌కు సిఫార్సు చేశారు. ఆ సమయంలో పిల్లర్ ద్వారా బాలుడికి పాలు పట్టించారు. దీంతో బాలుడు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. దీంతో వెంటనే బాలుడిని వార్డులోకి తీసుకెళ్లారు. డాక్టర్ మల్లేశ్వరి అంబు పరికరం ద్వారా కృత్రిమ శ్వాస అందించడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో బిడ్డ నోటి వెంట బాలు బయటకు వచ్చారుు. ఉదయం 6.05 నిమిషాలకు బాలుడు మృతి చెందాడు. డీఐఓ డాక్టర్ డేవిడ్ దామోదర్ బాధితులను పరామర్శించారు. మృతి చెందిన విషయంపై ఆరా తీశారు.
ఎవరూ పట్టించుకోలేదు
ఆస్పత్రికి తీసుకువచ్చినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. సకాలంలో స్పందించి ఉంటే నా బాబు బతికి ఉండేవాడు. తెల్లారుజామునే తీసుకువచ్చాం. మా కర్మకే ఏం చేద్దాం. గతంలోనూ ఇదే ఆస్పత్రిలో మూడు రోజుల మా పాప మృతి చెందింది. ఎవరితో చెప్పుకోవాలి....యా అల్లా..
-మహబూబ్‌బాష, అయిషా
ఏడుస్తున్నప్పుడు పాలు పట్టారు
సకాలంలో వైద్యం అందించాం. మా తప్పేమి లేదు. గంటన్నర పాటు ప్రయత్నించాం. బాబు ప్రాణం కాపాడేందుకు అన్ని విధాల కృషి చేశాం. బాబు ఊపిరితిత్తుల్లోకి పాలు వెళ్లాయి. అందుకే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. పాలు పట్టించవద్దని ముందుగానే చెప్పాం.
- డాక్టర్ హేమలత