డెంగీతో విద్యార్థిని మృతి | girl dies of dengue disease | Sakshi
Sakshi News home page

డెంగీతో విద్యార్థిని మృతి

Aug 16 2015 2:58 PM | Updated on Sep 3 2017 7:33 AM

డెంగీ వ్యాధితో విద్యార్థి మృతి చెందిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా టి. నర్సాపురం మండలం మక్కినవారిగూడెంలో ఆదివారం చోటు చేసుకుంది.

టి. నర్సాపురం: డెంగీ వ్యాధితో విద్యార్థి మృతి చెందిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా టి. నర్సాపురం మండలం మక్కినవారిగూడెంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు. గ్రామానికి చెందిన రమాదేవి (16) స్థానిక కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుండటంతో.. ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. ఆదివారం మధ్యాహ్నం మృతి చెందింది. దీంతో సరైన వైద్యం అందకపోవడంతోనే బాలిక మృతి చెందిందని.. ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement