'పార్టీ మారితే వార్డు మెంబర్ గా కూడా గెలవలేదు' | giddi eswari takes on kottapalli geetha | Sakshi
Sakshi News home page

'పార్టీ మారితే వార్డు మెంబర్ గా కూడా గెలవలేదు'

Jul 29 2014 9:10 PM | Updated on Aug 10 2018 8:08 PM

'పార్టీ మారితే వార్డు మెంబర్ గా కూడా గెలవలేదు' - Sakshi

'పార్టీ మారితే వార్డు మెంబర్ గా కూడా గెలవలేదు'

జిల్లాలోని అరకు నియోజకవర్గ సభ్యురాలు కొత్తపల్లి గీతపై పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తీవ్రంగా మండిపడ్డారు.

విశాఖ: జిల్లాలోని అరకు నియోజకవర్గ సభ్యురాలు కొత్తపల్లి గీతపై పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తీవ్రంగా మండిపడ్డారు. ఒకపార్టీ నుంచి ఎంపీగా గెలిచిన ఆమె .. వేరే పార్టీతో చర్చలు జరపడాన్ని ఈశ్వరి తప్పుబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన అనంతరం మిగతా పార్టీలతో మంతనాలు జరపడం ఎంతవరకూ సమంజసం అని ప్రశ్నించారు. మంగళవారం మీడియాతో మాట్లడిన ఈశ్వరి.. ఎంపీ అభ్యర్థిగా ఉన్న గీత పార్టీ మారి ఎన్నికలకు వెళ్తే వార్డు మెంబర్ గా కూడా గెలవలేదన్నారు.

కొత్తపల్లి గీత సోమవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయిన సంగతి తెలిసిందే. టీడీపీపీ నేత వై.సత్యనారాయణచౌదరి (సుజనాచౌదరి) వెంట ఆమె చంద్రబాబును కలిసేందుకు వెళ్లారు. దీనిపై వైఎస్సార్ సీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక పార్టీ నుంచి గెలిచిన అనంతరం వేరే పార్టీతో చర్చలు జరపడం సరైన చర్య కాదని మండిపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement