విజయవాడలో పైరసీ రక్కసి | Giantness piracy in Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో పైరసీ రక్కసి

Dec 25 2015 11:59 PM | Updated on Aug 21 2018 5:52 PM

విజయవాడలో పైరసీ రక్కసి - Sakshi

విజయవాడలో పైరసీ రక్కసి

పంజా సెంటర్‌లోని ఇస్లాంపేట డ్రైన్ వీధిలోని ఓ భవనంలో కొద్ది రోజులుగా సాగుతున్న పైరసీ సీడీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు.

రిలీజైన 24 గంటల్లోపే కొత్త సినిమాల సీడీలు లభ్యం
 
విజయవాడ(చిట్టినగర్): పంజా సెంటర్‌లోని ఇస్లాంపేట డ్రైన్ వీధిలోని ఓ భవనంలో కొద్ది రోజులుగా సాగుతున్న పైరసీ సీడీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. 15 వేల ఖాళీ సీడీలతో పాటు 5 వందలకుపైగా కొత్త సినిమా సీడీలు, కంప్యూటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. ఇస్లాంపేటలోని ఓ భవనంలో పైరసీ సీడీలను తయారు చేస్తున్నారని టాస్క్‌ఫోర్స్ పోలీసులకు గురువారం రాత్రి సమాచారం అందింది. కొత్తపేట స్టేషన్ సిబ్బంది సహకారంతో ఆ భవనంపై నిఘా పెట్టారు. శుక్రవారం ఉదయం టాస్క్‌ఫోర్స్ ఏసీపీ పీ మురళీధర్, ఎస్‌ఐ సురేష్‌రెడి ఆధ్వర్యంలో ఆకస్మికంగా దాడి చేశారు. అక్కడ సీడీ రైడర్లు సహా నిందితుడు తలశిల సురేష్ దొరికిపోయూడు. అతని సహాయకునిగా ఉన్న గర్రె సురేష్‌నూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పైరసీ సీడీని చెన్నె, ఖాళీ సీడీలను హైదరాబాద్‌లో కొనుగోలు చేసి కొత్త సినిమాలను ఎక్కిస్తున్నామని నిందితుడు తెలిపాడు. గురువారం రిలీజైన సౌఖ్యం సినిమాతో పాటు శుక్రవారం రిలీజైన జత కలిసే సినిమాలతో కూడిన సీడీ కవర్లు, కంప్యూటర్లు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం
 చేసుకున్నారు.

అన్నీ కొత్త సినిమాలే....
సౌఖ్యం, జత కలిసే, బెంగాల్ టైగర్, నవ మన్మధుడు, లోఫర్, హిందీ సినిమాలు బాజీరావు మస్తానీ, దిల్‌వాలేలతో పాటు పలు సూపర్ హిట్ సినిమా సీడీలను పోలీసులు గుర్తించారు. ఈ కేంద్రాన్ని నెల క్రితం ఏర్పాటు చేసినట్లు నిందితుడు పేర్కొంటున్నాడు. ఘటన స్థలాన్ని కొత్తపేట ఎస్‌ఐ సుబ్బారావు , సిబ్బంది పరిశీలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement