breaking news
The new film
-
విజయవాడలో పైరసీ రక్కసి
రిలీజైన 24 గంటల్లోపే కొత్త సినిమాల సీడీలు లభ్యం విజయవాడ(చిట్టినగర్): పంజా సెంటర్లోని ఇస్లాంపేట డ్రైన్ వీధిలోని ఓ భవనంలో కొద్ది రోజులుగా సాగుతున్న పైరసీ సీడీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. 15 వేల ఖాళీ సీడీలతో పాటు 5 వందలకుపైగా కొత్త సినిమా సీడీలు, కంప్యూటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. ఇస్లాంపేటలోని ఓ భవనంలో పైరసీ సీడీలను తయారు చేస్తున్నారని టాస్క్‌ఫోర్స్ పోలీసులకు గురువారం రాత్రి సమాచారం అందింది. కొత్తపేట స్టేషన్ సిబ్బంది సహకారంతో ఆ భవనంపై నిఘా పెట్టారు. శుక్రవారం ఉదయం టాస్క్‌ఫోర్స్ ఏసీపీ పీ మురళీధర్, ఎస్ఐ సురేష్‌రెడి ఆధ్వర్యంలో ఆకస్మికంగా దాడి చేశారు. అక్కడ సీడీ రైడర్లు సహా నిందితుడు తలశిల సురేష్ దొరికిపోయూడు. అతని సహాయకునిగా ఉన్న గర్రె సురేష్‌నూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పైరసీ సీడీని చెన్నె, ఖాళీ సీడీలను హైదరాబాద్‌లో కొనుగోలు చేసి కొత్త సినిమాలను ఎక్కిస్తున్నామని నిందితుడు తెలిపాడు. గురువారం రిలీజైన సౌఖ్యం సినిమాతో పాటు శుక్రవారం రిలీజైన జత కలిసే సినిమాలతో కూడిన సీడీ కవర్లు, కంప్యూటర్లు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అన్నీ కొత్త సినిమాలే.... సౌఖ్యం, జత కలిసే, బెంగాల్ టైగర్, నవ మన్మధుడు, లోఫర్, హిందీ సినిమాలు బాజీరావు మస్తానీ, దిల్వాలేలతో పాటు పలు సూపర్ హిట్ సినిమా సీడీలను పోలీసులు గుర్తించారు. ఈ కేంద్రాన్ని నెల క్రితం ఏర్పాటు చేసినట్లు నిందితుడు పేర్కొంటున్నాడు. ఘటన స్థలాన్ని కొత్తపేట ఎస్ఐ సుబ్బారావు , సిబ్బంది పరిశీలించారు. -
వైఎస్సార్ కాలనీలో శ్రీకాంత్ సినిమా షూటింగ్
ఇంద్రకీలాద్రి: శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ విజయవాడ పరిసరాల్లో శరవేగంగా జరుగుతోంది. పోలీస్ బ్యాక్ డ్రాప్లో విజయవాడ కేంద్రంగా నిర్మిస్తున్న ఈ సినిమాల్లోని ప్రధానాంశాలను విజయవాడ రూరల్ ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. స్థానిక వైఎస్సార్ కాలనీలో శనివారం వినాయక చవితి నిమజ్జనం సన్నివేశాలకు సంబంధించి హీరో శ్రీకాంత్, పోలీసులు, రౌడీల మధ్య చోటుచేసుకునే సంఘటనలను చిత్రీకరించారు. ఊరేగింపులో రౌడీలు పోలీసులపై దాడి చేసిన సన్నివేశాలతోపాటు రౌడీలు, హీరో శ్రీకాంత్‌కు మధ్య జరిగే సన్నివేశాలను షూట్‌చేశారు. జిల్లాతోపాటు నగరంలో 20రోజుల షెడ్యూల్ శనివారంతో ముగిసినట్లేనని ఆ చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. ఆయా సినిమాకు కరణం బాజ్జీ (శ్రీను) దర్శకత్వ వహిస్తుండగా, అనగాని ఫిలిమ్స్, సుబ్రహ్మేశ్వర ఆర్ట్ క్రియేషన్ సినిమాను నిర్మిస్తోంది. నిమజ్జనం సన్నివేశం కావడంతో స్థానిక యువత కూడా షూటింగ్లో భాగస్వాములయ్యారు. దుర్గమ్మను దర్శించుకున్న కృష్ణవంశీ, శ్రీకాంత్ ప్రముఖ సినీ దర్శకులు కృష్ణవంశీ, హీరో శ్రీకాంత్ శనివారం రాత్రి దుర్గమ్మను దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం కృష్ణవంశీ, శ్రీకాంత్‌లను అర్చకులు ఆశీర్వచనం అందచేయగా, ఆలయ అధికారులు ప్రసాదాలను అందజేశారు.