కత్రియ హోటల్ను సీజ్ చేసిన అధికారులు | GHMC officials seized Katriya hotel | Sakshi
Sakshi News home page

కత్రియ హోటల్ను సీజ్ చేసిన అధికారులు

Jan 9 2014 2:04 PM | Updated on Sep 2 2017 2:26 AM

సోమాజిగూడలోని కత్రియ హోటల్ను గురువారం హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు సీజ్‌ చేశారు.

హైదరాబాద్ : సోమాజిగూడలోని కత్రియ హోటల్ను గురువారం  హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు సీజ్‌ చేశారు. గత మూడేళ్లుగా ఆస్తి పన్ను బకాయిలు ఉండటంతో అధికారులు ఈ మేరకు చర్య తీసుకున్నారు.  కార్పొరేషన్‌కు పన్ను చెల్లించకపోడవంతో పలుసార్లు నోటీసులు జారీ చేశామని, అయినప్పటికీ బకాయిలు చెల్లించకపోవటంతో హోటల్ను సీజ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతంలోనూ బకాయిలు చెల్లించాలంటూ హోటల్ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement