ఆర్టీసీ కళాకారులు ప్రదర్శించిన ‘స్ఫూర్తి’ నాటిక సమైక్యవాదులను ఉత్తేజపరిచింది. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి 9 గంటలకు బస్టాండ్ ఆవరణలో నాటికను ప్రదర్శించారు.
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్: ఆర్టీసీ కళాకారులు ప్రదర్శించిన ‘స్ఫూర్తి’ నాటిక సమైక్యవాదులను ఉత్తేజపరిచింది. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి 9 గంటలకు బస్టాండ్ ఆవరణలో నాటికను ప్రదర్శించారు. రాష్ట్ర విభజనతో జరిగే అనర్థాలు, సమైక్యాంధ్రతో కలిగే లాభాలను కళాకారులు వివరించారు. నాటికలో భాగంగా సోనియాగాంధీ కొడుకు రాహుల్‌ను ప్రధానిని చేసేందుకే రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోందని కళాకారులు చెప్పడంతో సమైక్యవాదులు ఆగ్రహానికి లోనై సోనియా డౌన్.. డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
కళాకారులు ఆంథోని, శ్రీనివాసులు, ఖాదర్, నరసింహులు, శ్రీనివాసులు, రత్నం, రమణ, ప్రదర్శనలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ఆర్టీసీ ఆర్‌ఎం జీ వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు తిమ్మప్ప, నరసింహులు, రమణా రెడ్డి, ఆర్టీసీ డెప్యూటీ సీటీఎం మధుసూదన్, పీఓ నరేంద్ర రెడ్డి, చంద్రశేఖర్, నరసింహులు, పీవీ రమణా రెడ్డి, కొండయ్య పాల్గొన్నారు.