గ్యాస్ సిలిండర్ల కంటైనర్ బోల్తా | gas cylinder container roll in kurnool distirict | Sakshi
Sakshi News home page

గ్యాస్ సిలిండర్ల కంటైనర్ బోల్తా

Jun 23 2015 10:14 AM | Updated on Sep 3 2017 4:15 AM

ఓ డ్రైవర్ నిర్లక్ష్యంతో గ్యాస్ సిలీండర్ల లోడ్‌తో వెళుతున్న వాహనం బోల్తా కొట్టింది.

కర్నూలు : ఓ డ్రైవర్ నిర్లక్ష్యంతో గ్యాస్ సిలీండర్ల లోడ్‌తో వెళుతున్న వాహనం బోల్తా కొట్టింది. ఈ ఘటన మంగళవారం తెల్లవారు జామున ఆళ్లగడ్డ రూరల్ పోలీసు స్టేషన్ సమీపంలో కర్నూలు- తిరుపతి రహదారిపై చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి భారత్ గ్యాస్ సిలండర్ల లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ ఆళ్లగడ్డ సమీపానికి రాగానే బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ప్రమాదం జరిగింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
(ఆళ్లగడ్డ)
 

Advertisement
 
Advertisement
Advertisement