చౌటుపల్లిలోకి మరోసారి గండికోట నీరు | gandikota dam water comes to chowtapalli village in ysr district | Sakshi
Sakshi News home page

చౌటుపల్లిలోకి మరోసారి గండికోట నీరు

Jan 21 2017 9:35 AM | Updated on Sep 5 2017 1:46 AM

చౌటుపల్లిలోకి మరోసారి గండికోట నీరు

చౌటుపల్లిలోకి మరోసారి గండికోట నీరు

వైఎస్‌ఆర్‌ జిల్లాలో జలాశయానికి మరోసారి గండిపడింది.

వైఎస్‌ఆర్‌ జిల్లా : వైఎస్‌ఆర్‌ జిల్లాలో జలాశయానికి మరోసారి గండిపడింది. చౌటుపల్లి గ్రామంలో ప్రవహిస్తున్న గండికోట జలాశయానికి అడ్డుగా నిర్మించిన మట్టికట్ట తెగిపోయింది. దీంతో గ్రామంలోకి భారీగా నీరు చేరడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

చౌటుపల్లిలో 911 మంది బాధితులకు గాను ప్రభుత్వం కేవలం 140 మందికి మాత్రమే పరిహారం అందించింది. పరిహారం అందని బాధితులు గ్రామంలోనే ఉండిపోయారు. ఆందోళనలు చేశామన్న కారణంతోనే ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తుందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఐదు అడుగుల మేర నీరు రావడంతోనే మట్టికట్ట తెగిందని గ్రామస్తులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement