'కృష్ణ, మహేష్ అభిమానులకు థ్యాంక్స్' | Galla Jayadev Thanks to Krishna, Mahesh Fans | Sakshi
Sakshi News home page

'కృష్ణ, మహేష్ అభిమానులకు థ్యాంక్స్'

Mar 13 2014 5:29 PM | Updated on Mar 9 2019 3:26 PM

'కృష్ణ, మహేష్ అభిమానులకు థ్యాంక్స్' - Sakshi

'కృష్ణ, మహేష్ అభిమానులకు థ్యాంక్స్'

తనను ఆదరించిన టీడీపీ కార్యకర్తలకు, అభిమానిస్తున్న ప్రజలకు పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ కృతజ్ఞతలు తెలిపారు.

గుంటూరు: తనను ఆదరించిన టీడీపీ కార్యకర్తలకు, అభిమానిస్తున్న ప్రజలకు పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ కృతజ్ఞతలు తెలిపారు. నందమూరి, కృష్ణ, మహేష్ అభిమానులకు కూడా ధన్యవాదాలు తెలిపారు. గుంటూరు లోక్సభ స్థానానికి సంబంధించిన అంశాలతో కూడిన మేనిఫెస్టో రూపకల్పన చేశానని వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తానని హామీయిచ్చారు. మిర్చి, పత్తి దిగుబడి మరింత పెరిగేందుకు, రైతులకు గిట్టుధర కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

గుంటూరు లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా జయదేవ్ పోటీ చేయనున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ గుంటూరు లోక్సభ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులయ్యారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బృందావన్ గార్డెన్స్‌లో ఓ ఇల్లు కూడా తీసుకున్నారు.  జయదేవ్ తల్లి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కూడా టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లాలోని సొంత నియోజకవర్గం చంద్రగిరి నుంచి ఆమె టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement