భర్త ఇంటి ముందు భార్య ధర్నా | Fraud in the name of love | Sakshi
Sakshi News home page

భర్త ఇంటి ముందు భార్య ధర్నా

Nov 2 2015 11:45 AM | Updated on Jul 29 2019 6:54 PM

ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని ఆరోపిస్తు యువతి భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది.

ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని ఆరోపిస్తు యువతి భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనకు న్యాయం జరిగేంత వరకు అక్కడి నుంచి కదిలేదని భీష్మించుకొని కూర్చుంది. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్‌లో సోమవారం చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివాసముంటున్న శేఖర్ అనేవ్యక్తి గుంటూరుకు చెందిన విజయ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాగా.. శేఖర్ ఓ ప్రముఖ తెలుగు ఛానల్ కరస్పాండెంట్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు నివాసాన్ని మార్చి అయిలాపూర్ గ్రామానికి చెందిన మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న విజయ బండలింగాపూర్ చేరుకొని ఆందోళనకు దిగింది. తమ పెళ్లి ఫోటోలు చూపించి.. తనకు న్యాయం చేయాలని కోరింది.
 

Advertisement
 
Advertisement
Advertisement