ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. బదిలీ చేసిన స్థానాలను చూస్తే.. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా కరికాల వల్లవన్, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శిగా లవ్ అగర్వాల్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్గా పూనం మాలకొండయ్య, పౌరసరఫరాల కమిషనర్గా డి.శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.