
'సెక్షన్- 8తో ఏపీకి ఒరిగేదేమీ లేదు'
సెక్షన్- 8 అమలయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ కు ఒరిగేదేమీలేదని, ఇక్కడి ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని మాజీ మంత్రి కొండ్రు మురళి స్పష్టం చేశారు.
హైదరాబాద్: సెక్షన్- 8పై తెలుగుదేశం పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కొండ్రు మురళి మండిపడ్డారు. ఒకవేళ ఆ సెక్షన్ అమలయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ కు ఒరిగేదేమీలేదని, ఇక్కడి ప్రజలకు ఎలాంటి లాంభం కలగబోదని స్పష్టం చేశారు.
మంగళవారం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఓటుకు కోట్లు పంచి అవినీతి కేసుల్లో ఇరుక్కున్న చంద్రబాబుకు ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీసే ధైర్యంలేదని విమర్శించారు.