ప్రజల కోసం పనిచేయండి | For people who work with | Sakshi
Sakshi News home page

ప్రజల కోసం పనిచేయండి

Jan 29 2015 2:00 AM | Updated on Oct 4 2018 5:44 PM

ప్రజల కోసం పనిచేయండి - Sakshi

ప్రజల కోసం పనిచేయండి

ప్రతి అధికారి రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలకోసం పనిచేయాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

లక్కిరెడ్డిపల్లె: ప్రతి అధికారి రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలకోసం పనిచేయాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎంపీడీఓ సభాభవనంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షాసమావేశంలో వారు మాట్లాడుతూ గత ఆరేళ్లుగా రైతులను కరువు పట్టి పీడిస్తోందని, గ్రామాలలో భూగర్భజలాలు అడుగంటి పోవడంతో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని చెప్పారు. ఇలాంటి పరిస్థితులలో రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల దాహార్తిని తీర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే ఎంపీ నిధుల మొత్తాన్ని తాగునీటికి కేటాయించామన్నారు.

అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బోర్లలో నీరు పడకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు తాగునీటిపై పరిస్థితులను సమీక్షిస్తూ కనీసం ట్యాంకర్ల ద్వారా అయినా నీరు సరఫరా చేయాలని సూచించారు. చేతి పంపులుకానీ, స్కీంబోర్లకు కానీ మరమ్మతులు చేపట్టేందుకు ఎన్‌ఆర్‌డీబీఈ కింద నిధులున్నాయని వెంటనే మరమ్మతులు చేపట్టేందుకు గ్రామాల వారీగా నివేదికలు సిద్ధం చేయాలన్నారు. అధికారులు ఎక్కడైనా పక్షపాత వైఖరి అవలంబిస్తే జిల్లా విజిలెన్స్ కమిటీకి నివేదించి చర్యలు తీసుకునేలా చూస్తామని హెచ్చరించారు.

గత ఐదేళ్లుగా రైతులు సాగుచేస్తున్న వేరుశనగ పంటతో పూర్తిగా నష్టపోతున్నారని రైతులకు పంట నష్టపరిహారం కానీ, పంటల బీమా ద్వారా కానీ ఒక్క రూపాయి కూడా అందడంలేదన్నారు. అధికారుల తప్పిదంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లె జెడ్పీటీసీ సభ్యుడు మద్దిరేవుల సుదర్శన్‌రెడ్డి, ఎంపీపీ అంబాబత్తిన రెడ్డెయ్య, మండల ప్రత్యేకాధికారి విజయ్‌కుమార్, తహశీల్దార్ చెండ్రాయుడు, ఎంపీడీఓ లక్ష్మీదేవి, వ్యవసాయ ఏడీ ప్రభాకర్ బాబు, ఆర్‌డబ్ల్యుఎస్ డీఈ శ్రీనివాసులరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు శిద్దక రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement