విజయవాడ బెంజ్ సర్కిల్‌లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి.
విజయవాడ: విజయవాడ బెంజ్ సర్కిల్‌లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాదికి పూర్తిస్థాయి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావుతో కలిసి ఆయన వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
రూ.220 కోట్ల వ్యయంతో రమేష్ ఆస్పత్రి నుంచి స్కూబ్రిడ్జి వరకు రూ.1.47 కి.మీ. మేర ఆరు వరుసల్లో నిర్మించనున్నట్లు మంత్రి దేవినేని తెలిపారు. ఫ్లైఓవర్ నిర్మాణంతో విజయవాడ ప్రజల ట్రాఫిక్ చింతలు తీరతాయని, వారి చిరకాల వాంఛ తీరుబోతోందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.4వేల కోట్లతో విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ వంతెన అమరావతి నగరానికి గేట్ వేగా మారుతుందని ఎమ్మెల్యే గద్దె పేర్కొన్నారు.