
రేణిగుంట: త్వరలోనే తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు విమాన సర్వీసులు నడిపేందుకు ఎయిరిండియా సుముఖత వ్యక్తం చేసినట్లు తిరుపతి వైఎస్సార్‌సీపీ ఎంపీ డా.వెలగపల్లి వరప్రసాదరావు తెలిపారు. రేణిగుంట ఎయిర్‌పోర్టులో గురువారం జరిగిన ఎయిర్‌పోర్టు అడ్వైజరీబోర్డు కమిటీ సమావేశానికి ఆయన చైర్మన్ హోదాలో హాజరయ్యారు.
ఎయిర్‌పోర్టు ప్రగతి, ప్రయాణికులకు కల్పించే సౌకర్యాలను గురించి ఎయిర్‌పోర్టు డైరెక్టర్ హెచ్.పుల్లాను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ వరప్రసాదరావు మీడియాతో మాట్లా్లడారు. తాను విమాన సర్వీసులకోసం పార్లమెంట్‌లో ప్రస్తావించడంతో కేంద్ర మంత్రి అశోకగజపతిరాజు సానుకూల దృక్పథంతో ఉన్నారని తెలిపారు.