ల్యాండింగ్‌ ట్రబుల్‌.. గాలిలో హైదరాబాద్‌ విమానం! | flights stranded at gannavaram airport due to fog | Sakshi
Sakshi News home page

ల్యాండింగ్‌ ట్రబుల్‌.. గాలిలో హైదరాబాద్‌ విమానం!

Feb 2 2017 10:31 AM | Updated on Sep 5 2017 2:44 AM

భారీగా పొగమంచు కమ్ముకోవడంతో కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో గురువారం ఉదయం పలు విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

గన్నవరం: భారీగా పొగమంచు కమ్ముకోవడంతో కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో గురువారం ఉదయం  పలు విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా వాతావరణం తీవ్ర ప్రతికూలంగా ఉండటంతో విమానాల ల్యాండింగ్‌ కష్టంగా మారింది.

దీంతో ఇప్పటికే గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ చేరిన హైదరాబాద్‌ ట్రుజెట్‌ విమానం ల్యాండింగ్‌ సమస్యతో గాలిలో చక్కర్లు కొడుతోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం కూడా ల్యాండింగ్‌ ట్రబుల్‌ ఎదురవ్వడంతో గాలిలోనే తిరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement