గన్నవరం ఎయిర్ పోర్టులో ఎబోలా అలర్ట్ | Ebola Alert, Screening Tests Intensified For International Passengers At Gannavaram Airport | Sakshi
Sakshi News home page

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎబోలా అలర్ట్

May 26 2026 10:41 AM | Updated on May 26 2026 11:27 AM

Ebola Alert At Gannavaram Airport

సాక్షి, కృష్ణా జిల్లా: ఎబోలా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటర్నేషనల్ పాసింజర్స్‌కు స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. కాంగో, ఉగాండా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ విస్తృతి, కేసులు, మరణాల నమోదు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో గన్నవరం ఎయిర్‌ పోర్టులో ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. సింగపూర్ నుంచి 185 మంది ప్రయాణికులతో విమానం రాగా, వారికి థర్మల్‌ స్క్రీనింగ్ నిర్వహించారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల ద్వారా వచ్చే ప్రయాణికులు, పర్యాటకుల ట్రావెల్ హిస్టరీ ఆధారంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement