ఫైర్‌మన్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన నెల్లూరు నగరంలో కలకలం సృష్టించింది.
నెల్లూరు: ఫైర్‌మన్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన నెల్లూరు నగరంలో కలకలం సృష్టించింది. ఫైర్ స్టేషన్ కార్యాలయంలో కె. అనిల్ అనే ఉద్యోగి శనివారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గమనించిన తోటి ఉద్యోగులు వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అనిల్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. తోటి ఉద్యోగుల వేధింపుల వల్లే అనిల్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.