ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కృష్ణా : పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లలో అపశ్రుతి దొర్లింది. దేవస్థానం సమీపంలో ఆలయ పరిసరాల్లో భక్తుల కోసం వేసిన తాటాకు పందిళ్ళు కింద వంట చేస్తుండగా అగ్గి కీలలు ఎగసిపడి తాటాకులను అంటుకున్నాయి. దీంతో మంటలు చెలరేగాయి. మంటలును చూసి భయభ్రాంతులకు గురైన భక్తులు పరుగులు తీశారు. దీంతో తొక్కిసిలాట జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు.
అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినా ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకోలేదు. మంటలను అదుపు చేయడానికి నీరు లేవంటూ ఫైర్ సిబ్బంది సాకులు చెప్పారు. దీంతో స్థానికులే బిందెలతో మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.


