వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం : భారీ నష్టం | Fire accident in srikalahasti | Sakshi
Sakshi News home page

వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం : భారీ నష్టం

Dec 18 2014 8:18 AM | Updated on Sep 5 2018 9:45 PM

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ఓ వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది.

చిత్తూరు: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ఓ వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. భద్రత సిబ్బంది స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అగ్నిమపక సిబ్బంది ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటలు అర్పుతున్నారు.

అయితే ఒక్క ఫైరింజన్ ఉండటంతో మంటలు అదుపులోకి తీసుకురావడం కష్టసాధ్యంగా మారింది. దాంతో అగ్నిమాపక సిబ్బంది మరో ఫైరింజన్ పంపాలని ఉన్నతాధికారులను కోరారు. అగ్నిప్రమాదంతో భారీ నష్టం సంభవించిందని దుకాణ యాజమానులు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement