కళ్యాణదుర్గంలో అగ్ని ప్రమాదం: రూ.5లక్షల ఆస్తి నష్టం | fire accident in kalyana durgam: Rs 5 lakh property damage | Sakshi
Sakshi News home page

కళ్యాణదుర్గంలో అగ్ని ప్రమాదం: రూ.5లక్షల ఆస్తి నష్టం

Feb 8 2015 10:21 PM | Updated on Sep 5 2018 9:45 PM

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల కేంద్రంలో ఆదివారం రాత్రి బ్యాంగిల్ షాపు స్టోర్ రూంలో అగ్ని ప్రమాదం జరిగింది

అనంతపురం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల కేంద్రంలో ఆదివారం రాత్రి బ్యాంగిల్ షాపు స్టోర్ రూంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రూ.5 లక్షల విలువచేసే వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement