అల్లవరంలో అగ్నిప్రమాదం | fire accident in east godavari district | Sakshi
Sakshi News home page

అల్లవరంలో అగ్నిప్రమాదం

Feb 24 2016 6:22 PM | Updated on Sep 5 2018 9:45 PM

తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం దేవగుప్తంలో బుధవారం షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం దేవగుప్తంలో బుధవారం షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.  వివరాలు ఇలా ఉన్నాయి.... దేవగుప్తంలో ప్రధాన రహదారికి అనుకుని ఉన్న కరెంటువైర్లకు కొబ్బరాకులు రాసుకోవడంతో నిప్పు రవ్వలు ఎగసిపడ్డాయి. దాంతో పక్కనే ఉన్న ఇంటికి నిప్పంటుకుంది.

స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే ఫైరింజన్లతో వారు వచ్చే సరికి మంటలు పక్కనే ఉన్న ఇళ్లకు వ్యాపించాయి. దీంతోమరో  ఆరు పూరిగుడిసెలు దగ్ధమైనాయి. సుమారు రూ. 10 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని అంచనా.
 

Advertisement
 
Advertisement
Advertisement