అగ్నిప్రమాదం : భారీ నష్టం | fire accident in cloth showroom at Thotapalli | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదం : భారీ నష్టం

Dec 26 2014 9:43 AM | Updated on Sep 5 2018 9:45 PM

తూర్పు గోదావరి జిల్లా నెల్లిపాక మండలం తోటపల్లిలో శుక్రవారం వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా నెల్లిపాక మండలం తోటపల్లిలో శుక్రవారం వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దాంతో పక్కనే ఉన్న మరో వస్త్ర దుకాణానికి మంటలు వ్యాపించాయి. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.

ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదంలో రూ. 20 లక్షలు ఆస్తి అగ్నికి ఆహుతి అయిందని దుకాణం యజమానులు తెలిపారు.

Advertisement