ఆంధ్రాబ్యాంకులో అగ్నిప్రమాదం | Fire accident in andhra bank in chilakaluripet town | Sakshi
Sakshi News home page

ఆంధ్రాబ్యాంకులో అగ్నిప్రమాదం

Jun 30 2015 1:29 PM | Updated on Sep 5 2018 9:45 PM

గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని ఆంధ్రాబ్యాంక్‌లో మంగళవారం అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

గుంటూరు : గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని ఆంధ్రాబ్యాంక్‌లో మంగళవారం అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. దాంతో వెంటనే అప్రమత్తమైన బ్యాంకు అధికారులు, సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.

ఫైరింజన్లలో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement