మారేడుపల్లిలో ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం | Fire accident at apartment in marredpally | Sakshi
Sakshi News home page

మారేడుపల్లిలో ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం

Mar 16 2014 11:45 AM | Updated on Sep 5 2018 9:45 PM

నగరంలోని మారేడుపల్లిలో ఓ అపార్ట్మెంట్లో ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

నగరంలోని మారేడుపల్లిలో  ఓ అపార్ట్మెంట్లో ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. అపార్ట్మెంట్ వాసులు భయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపకశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

 

షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు అపార్ట్ మెంట్ వాసులను ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement