
స్వామి వారికి పరదాలు సమర్పిస్తతన్న ప్రసన్నరెడ్డి
సాక్షి ప్రతినిధి, తిరుపతి : హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తురాలు మూడేళ్లుగా తిరుపతి కోదండ రామస్వామికి భక్తి పూర్వక సేవలందిస్తూ తరిస్తోంది. ఏటా మార్చిలో జరిగే కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు ఆధ్యాత్మిక, పురా ణ కథల పరదాలను విరాళంగా అందజేస్తోంది. వృత్తి రీత్యా ఫ్యాషన్ డిజైనర్ అయిన ప్రసన్నరెడ్డి హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి ఏరియాలో ఉంటున్నారు. ఐదేళ్ల కింద ట బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో తిరుపతిలోని కోదండరామస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. అప్పట్లో ఆలయ ప్రధాన ద్వారం దగ్గ ర వేలాడే స్వామివారి పరదాలను చూశారు. అందమైన దేవతల బొమ్మలతో పరదాలను తయారు చేయించి అందజేస్తే బాగుంటుందని నిర్ణయించుకున్నారు.
ఆ తరువాత సంవత్సరం నుంచి ఏటా బ్రహ్మోత్సవాలకు వారం రోజుల ముందు సరికొత్త డిజైన్లు, దేవతల స్వరూపాలతో కూడిన పరదాలను సొంత వర్క్‌షాప్‌లో తయారుచేయించి తిరుపతి తీసుకొస్తున్నారు. ఏటా ఇందుకోసం రూ.3 లక్షలు ఖర్చు చేస్తున్న ప్రసన్నరెడ్డి ఈ ఏడాది కూడా స్వామివారికి 30 పరదాలను సమకూర్చా రు. మేలు రకం క్లాత్‌ను ఎంపిక చేసుకుని పవిత్రంగా పరదాలను తయారు చేయిస్తున్నానని ప్రసన్నరెడ్డి ‘సాక్షికి తెలిపారు. తన తల్లిదండ్రులకు శ్రీరామచంద్రమూర్తిస్వామి వారంటే ఎనలేని భక్తి, తనకూ శ్రీరామనవమి ఉత్సవాలంటే ఎంతో ఇష్టమని ఆమె వివరించారు. స్వామి వారికి ఏటా పరదాలను సమకూర్చి అందజేసే అదృష్టాన్ని ముందు ముందు కూడా కలుగజేయాలని భగవంతుని కోరుకుంటున్నానని ప్రసన్నరెడ్డి వెల్లడించారు.