‘బిల్లు’పోటు! | Farmers livid over delay in crop loss compensation | Sakshi
Sakshi News home page

‘బిల్లు’పోటు!

Oct 30 2017 9:32 AM | Updated on Oct 1 2018 2:16 PM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: దోమపోటుకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. దీనిపై ఎన్నిసార్లు అధికారులను కలిసినా ఫలితం ఉండడం లేదు. రైతులే నేరుగా కలెక్టర్‌ను, ఖజానా శాఖ అధికారులను కలిసినా లాభం లేకపోయింది. రెండేళ్ల నుంచి రైతులకు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. ఖజా నా శాఖ సిబ్బంది తమ ఆర్థిక ప్రయోజనాలు చూసుకునే బిల్లు జాప్యం చేస్తున్నారని వ్యవసా య శాఖ అధికారులు కొందరు ఆరోపిస్తున్నా రు. దీనిపై కమిటీ కూడా వేసి వారికి ఎలాంటి మార్గ దర్శకాలు ఇవ్వకుండా వేరే శిక్షణకు పంపిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని అంటున్నా రు. దీనిపై శుక్రవారం జరిగిన జిల్లా పరిషత్‌ సమావేశంలో చర్చ రావడంతో తాజాగా శనివా రం వ్యవసాయ శాఖ అధికారులు ఖజానా శాఖ డీడీని ఆమె కార్యాలయంలో కలిసి సమస్యను పరిష్కరిం చాలని కోరారు.  

2014 నుంచి..
2014లో ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో వరి దోమపోటుకు గురైంది. దాదాపు 20 మండలాల్లో వేలా ది హెక్టార్లలో పంట నాశనమైంది. దీనికి ప్రభుత్వం నష్ట పరిహారం కింద రూ.22 కోట్లు మం జూరు చేసింది. అయితే ఇందులో రూ.17 కోట్లు అప్పుడే రైతుల ఖాతాలో జమయ్యాయి. మిగి లిన డబ్బు వెయ్యి మంది రైతులకు అందాల్సి ఉంది. ఈ పరిహారం కోసం ఏడాదిన్నర కిందటే బిల్లులు ఖజానా శాఖ అధికారులకు అందించా మని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నా రు. ఇప్పటికీ రైతులకు పరిహారం అందలేదు.

మంత్రి చెప్పినా
దోమపోటు పరిహారం చెల్లించాలని కలెక్టర్‌ చా లాసార్లు అధికారులకు పలు సమావేశాల్లో సూ చించారు. మూడు నెలల కిందట జిల్లా పరిషత్‌ సమావేశంలో మంత్రి కూడా బిల్లులు చెల్లిం చాలని ఆదేశించారు. కానీ ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాలేదు.

వెంటనే పరిష్కరించాలి
దోమపోటు పరిహారం వెంటనే రైతులకు చెల్లిం చాలని, సకాలంలో చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని గత శనివా రం వ్యవసాయ శాఖ జేడీ జి.రామారావు, ఇతర ఏడీఈలు, డీడీలు ఖజానా శాఖ డీడీ నిర్మలమ్మ ను కోరారు. అయితే దీనికి ఖజానా శాఖ అధి కారులు కారణాలు చెప్పే ప్రయత్నం చేయగా, వ్యవసాయాధికారులు స్పందిస్తూ వెంటనే బిల్లులు చేయాలని, కమిటీల పేరిట కాలయాపన లే కుండా నేరుగా బిల్లు చేసి, రైతుల బ్యాంకు ఖా తాల్లో పరిహారం జమచేయాలని వారు ఒత్తిడి చేశారు. తర్వాత వారు ఖజానా శాఖ తీరుపై జిల్లా ఉన్నతాధికారులను కలిసి వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement