విద్యుదాఘాతంతో రైతు మృతి | Farmer dies due to Electrocution | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Aug 20 2015 4:08 PM | Updated on Oct 1 2018 2:44 PM

పొలానికి వెళ్లిన రైతు వర్షానికి తెగి పడ్డ విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు.

కుందుర్తి (అనంతపురం) : పొలానికి వెళ్లిన రైతు వర్షానికి తెగి పడ్డ విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. అనంతపురం జిల్లా కుందుర్తి మండలం కదరంపల్లె గ్రామానికి చెందిన రామలింగారెడ్డి(42) గురువారం మధ్యాహ్నం పొలానికి వెళ్లాడు. అయితే బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి విద్యుత్ తీగలు చెల్లాచెదరుగా పడిపోయాయి.

బోరు మోటారు వైపు వెళ్తున్న ఆయన కాలికి తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement