వైఎస్సార్ జిల్లా వేంపల్లె గండి రోడ్డులో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైతు మృతి చెందాడు.
వేంపల్లె: వైఎస్సార్ జిల్లా వేంపల్లె గండి రోడ్డులో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైతు మృతి చెందాడు. మల్లేష్(50) అనే రైతు తోటకు వెళ్లి నీళ్లు పారించి ఇంటికి తిరిగి వస్తుండగా వేగంగా వచ్చిన ఇన్నోవా కారు ఢీకొంది. దాంతో మల్లేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.