వీఆర్వోపై బ్లేడ్‌తో దాడి | Farmer attacks Village Revenue Officer | Sakshi
Sakshi News home page

వీఆర్వోపై బ్లేడ్‌తో దాడి

Sep 14 2015 4:58 PM | Updated on Apr 3 2019 3:50 PM

చిత్తూరు జిల్లా పుంగనూరు తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్వో మురళిపై ఓ రైతు బ్లేడ్‌తో దాడి చేశాడు.

పుంగనూరు : చిత్తూరు జిల్లా పుంగనూరు తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్వో మురళిపై ఓ రైతు బ్లేడ్‌తో దాడి చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం సాయంత్రం సమయంలో నెక్కొండి గ్రామ వీఆర్వో మురళి విధుల్లో ఉన్న సమయంలో... మర్రిమాకులపల్లి గ్రామానికి చెందిన రైతు అగస్త్య రెడ్డి దాడి చేసి బ్లేడ్‌తో గొంతు కోసి పరారయ్యాడు. ఈ దాడిలో వీఆర్వో మురళికి తీవ్ర గాయలు కాగా, వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కాగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు సరఫరా అవుతున్న మంచి నీటిని రైతు అగస్త్యరెడ్డి అక్రమంగా వాడుతుండడంతో గ్రామస్తులు తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. తహశీల్దార్ ఆదేశాల మేరకు వీఆర్వో మురళి ఆదివారం మర్రిమాకులపల్లి వెళ్లి అగస్త్య రెడ్డి అక్రమంగా నీటిని వాడుకోకుండా పైప్‌లైనును తొలగించారు. దీంతో కక్ష పెంచుకున్న అగస్త్యరెడ్డి సోమవారం దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement