నకిలీ విజిలెన్స్ అధికారుల పట్టివేత | fake vigilance officers arrested in anantapur district | Sakshi
Sakshi News home page

నకిలీ విజిలెన్స్ అధికారుల పట్టివేత

Sep 15 2015 1:46 PM | Updated on Aug 20 2018 4:27 PM

అనంతపురం జిల్లాలో విజిలెన్స్ అధికారుల పేరుతో దందాలకు దిగిన ఇద్దరు వ్యక్తులను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తలుపుల: అనంతపురం జిల్లాలో విజిలెన్స్ అధికారుల పేరుతో దందాలకు దిగిన ఇద్దరు వ్యక్తులను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. తలుపుల మండలంలోని ఓదులపల్లి గ్రామంలోని రేషన్ దుకాణానికి సోమవారం భాస్కర్, వలీ అనే ఇద్దరు వ్యక్తులు వచ్చి తాము విజిలెన్స్ అధికారులమని చెప్పి సోదాలు చేశారు. రేషన్ డీలర్ దగ్గర కొంత మొత్తం నగదు పుచ్చుకుని వెళ్లారు.

వారు వెళ్లిన తర్వాత రేషన్ డీలర్ రెవెన్యూ అధికారులను విచారించగా తమకు సమాచారం లేదన్నారు. మంగళవారం భాస్కర్, వలీ కుర్లి గ్రామం రేషన్ డీలర్ దగ్గరకు వెళ్లి విజిలెన్స్ అధికారుల పేరుతో సోదాలకు దిగారు. డీలర్ వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారు పోలీసులకు విషయం తెలుపగా, రంగంలోకి దిగిన పోలీసులు భాస్కర్, వలీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement