నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను విశాఖ పోలీసులు పట్టుకున్నారు.
విశాఖపట్నం: నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు. ఈ ముఠాకు చెందినవారంతా బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం ముర్షిదాబాద్‌కు చెందినవారని పోలీసులు చెబుతున్నారు. రెండు బృందాలుగా విడిపోయిన వీరు నకిలీ నోట్లను మార్చేందుకు పెద్ద ప్రణాళికే వేసుకున్నట్లు తెలుస్తోంది. చిన్నచిన్న చిల్లర దుకాణాల్లో పలు వస్తువులు కొనుగోలుచేసేందుకు నకిలీ వెయ్యి రూపాయల నోట్లు ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు.
బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంవారు మన రాష్ట్రంలో నకిలీ నోట్లు చెలామణి చేయడం ఎక్కవైపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పరిసర గ్రామాల్లో నకిలీ కరెన్సీ నోట్లను చెలామణి చేస్తున్న అయిదుగురిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. వారు కూడా కోల్కతా నుంచి ఈ నోట్లు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.