మాక్‌ డ్రిల్‌లో నిర్లక్ష్యం.. విశాఖలో దారుణం | Officials Negligence Cause Child Injured in Visakhapatnam Mock Drill | Sakshi
Sakshi News home page

మాక్‌ డ్రిల్‌లో నిర్లక్ష్యం.. విశాఖలో దారుణం

Jul 23 2025 3:54 PM | Updated on Jul 23 2025 4:06 PM

Officials Negligence Cause Child Injured in Visakhapatnam Mock Drill

మాక్‌ డ్రిల్‌(ప్రతీకాత్మక చిత్రం)

విశాఖలో దారుణం చోటు చేసుకుంది. మాక్ డ్రిల్‌ సందర్భంగా అధికారులు అజాగ్రత్తగా వ్యవహరించారు. దీంతో ఓ చిన్నారికి తీవ్ర గాయాలై ఆస్పత్రి పాలైంది.

గాజువాకలోని భారత్ డైనమిక్ లిమిటెడ్‌లో అధికారులు ఇవాళ మాక్‌ డ్రిల్  నిర్వహించారు. అయితే ఆ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారు. అటుగా ఓ కుటుంబం బైక్‌పై వస్తుంది గుర్తించని అధికారులు బాంబు పేల్చారు. దీంతో కుటుంబంలోని చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. 

అయితే ఆ తర్వాత కూడా ఆ పాపను ఆస్పత్రికి తరలించడంలో అధికారులు జాప్యం ప్రదర్శించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆస్పతత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆమెకు సర్జరీ తప్పనిసరని వైద్యులు చెబుతున్నారు. అధికారులు అజాగ్రత్తగా ఉండడంవల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తిట్టిపోస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement