దొంగనోట్ల ‘ఇంజనీర్’ అరెస్ట్ | fake currency engineer arrest | Sakshi
Sakshi News home page

దొంగనోట్ల ‘ఇంజనీర్’ అరెస్ట్

Mar 26 2014 7:53 PM | Updated on Jun 1 2018 8:39 PM

ఇంజనీరింగ్ చదివినా ఉద్యోగం రాకపోవడంతోపాటు ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో ఓ యువకుడు దొంగనోట్లు ముద్రించి, వాటిని చలామణి చేసేందుకు యత్నిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.

గుంతకల్లు: ఇంజనీరింగ్ చదివినా ఉద్యోగం రాకపోవడంతోపాటు ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో ఓ యువకుడు  దొంగనోట్లు ముద్రించి, వాటిని చలామణి చేసేందుకు యత్నిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అనంతపురం జిల్లా గుంతకల్లులో డీఎస్పీ సీహెచ్ రవికుమార్ తెలిపిన వివరాల మేరకు... స్థానిక సత్యనారాయణపేటలోని వాల్మీకినగర్‌లో నివాసముంటున్న రామాంజనేయులు కుమారుడు కళ్యాణ చక్రవర్తి కర్ణాటకలోని బెల్గాంలో మూడేళ్ల క్రితం ఇంజనీరింగ్ (బీఈ) పూర్తి చేశాడు.

అప్పటి నుంచి ఉద్యోగం రాకపోవడంతో కుంగిపోయాడు. ఈ నేపథ్యంలో సొంతంగా సాఫ్ట్‌వేర్ రూపొందించుకుని నకిలీ నోట్లు ముద్రించాడు. వాటిని కర్నూలు జిల్లా ఆలూరులో చలామణి చేసేందుకు వెళుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement