‘చార్‌ధామ్’ బాధితులకు ఎక్స్‌గ్రేషియా | ex gratia to char dham victims | Sakshi
Sakshi News home page

‘చార్‌ధామ్’ బాధితులకు ఎక్స్‌గ్రేషియా

Feb 7 2014 12:02 AM | Updated on Jul 11 2019 8:34 PM

ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రకు వెళ్లి వరదల్లో ప్రాణాలు కోల్పోయిన జిల్లావాసుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్ధిక సహాయం విడుదల చేసిందని కలెక్టర్ బి.శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు.

సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రకు వెళ్లి వరదల్లో ప్రాణాలు కోల్పోయిన జిల్లావాసుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్ధిక సహాయం విడుదల చేసిందని కలెక్టర్ బి.శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం 23మంది మృతులకు గాను ఒక్కో కుటుంబానికి రూ.3.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చిందన్నారు. కలెక్టర్ శ్రీధర్ గురువారం కలెక్టరేట్‌లోని కోర్టు హాలులో బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement