ఇంజినీరింగ్ విద్యార్థి కిడ్నాప్ | Engineering student kidnapped in krishna district | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్ విద్యార్థి కిడ్నాప్

Mar 15 2016 8:24 AM | Updated on Sep 3 2017 7:49 PM

కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆగంతకులు కిడ్నాప్ చేశారు.

నూజివీడు : కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆగంతకులు కిడ్నాప్ చేశారు. దీంతో సదరు విద్యార్థి తల్లిదండ్రులు ఆగిరిపల్లి పోలీసులను ఆశ్రయించి... ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అందులోభాగంగా ఐదురుగు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు వారిని తమదైన శైలిలో విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement