కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయిస్తా | Enable permanent contract workers | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయిస్తా

Nov 30 2014 1:26 AM | Updated on Sep 2 2017 5:21 PM

కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయిస్తా

కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయిస్తా

ఎన్టీటీపీఎస్‌లో ఎంతో కాలంగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయడానికి తాను...

రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని

ఎన్టీటీపీఎస్‌లో ఎంతో కాలంగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయడానికి తాను కృషి చేస్తానని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. స్థానిక ఎన్టీటీపీఎస్‌లో కాంట్రాక్టు కార్మికుడు నుంచి తెలుగు నాడు విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన పర్వతనేని సాంబశివరావుకు శుక్రవారం రాత్రి ఏకాలనీ ఎస్‌వీఎస్ కల్యాణ మండపంలో అభినందన సభ జరిగింది. ఈ సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంలో థర్మల్ కేంద్రం కీలకపాత్ర పోషిస్తోందన్నారు. సాంబశివరావు రాష్ట్ర అధ్యక్షుడు కావడం తనకు సంతోషంగా ఉందని తెలిపారు. ఈసందర్భంగా సాంబశివరావును ఘనంగా సన్మానించి మెమెంటోను అందజేశారు.

తొలుత ఇబ్రహీంపట్నం రింగుసెంటర్ నుంచి ఎ-కాలనీ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.  ఎన్టీటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ జె. సమ్మయ్య, ఇబ్రహీంపట్నం ఎంపీపీ చీదిరాల ప్రసూన,  వైఎస్ ఎంపీపీ వెంకటకృష్ణ, జెడ్పీటీసీ సభ్యురాలు రాధ, ఇబ్రహీంపట్నం గ్రామ మాజీ సర్పంచి మల్లెల పద్మనాభరావు, టీడీపీ నాయకుడు జంపాల సీతారామయ్య, తెలుగు నాడు విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ, ప్రాంతీయ కమిటీ నాయకులు, కార్యవర్గ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement