
ప్రతికాత్మక చిత్రం
సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి ఘాట్‌లో ఏనుగులు మరోసారి హల్‌చల్ చేశాయి. కాలినడక ప్రాంతంలో శ్రీవారి పాదాల వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో గజరాజుల గుంపు సంచారం చేసింది. దీంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్పందించిన అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. శ్రీవారి పాదాలకు సాయంత్ర సమయంలో వచ్చే భక్తులను నిలిపివేశారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా అన్నమయ్య మార్గాన్ని మూసివేశారు.