ఏనుగులను కవ్వించొద్దు | Elephants Attaks In Srikakulam | Sakshi
Sakshi News home page

ఏనుగులను కవ్వించొద్దు

Oct 27 2018 8:00 AM | Updated on Oct 27 2018 8:00 AM

Elephants Attaks In Srikakulam - Sakshi

దాశరధీపురం వద్ద ఏనుగులు గుంపు కదలికలను గమనిస్తున్న రేంజర్, తదితరలు

శ్రీకాకుళం, కొత్తూరు: పొలాల్లోకి వస్తున్న ఏనుగుల గుంపుపై ప్రజలు కవ్వింపు చర్యలకు పాల్పడొద్దని పాతపట్నం రేంజర్‌ సోమశేఖర్‌ తెలిపారు. నాలుగు ఏనుగులు గుంపు శుక్రవారం రాత్రి మండలంలోని దాశరధీపురం, కాశీపురం మధ్య కొండ ప్రాంతంలో తిష్ట వేశాయి. ఇవి వరి పొలాల్లోకి వచ్చే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఏనుగుల గుంపు కదలికలపై కేర్‌ టేకర్స్‌ నిఘా పెడుతున్నారని తెలిపారు. కొండపై నుంచి కిందకు దిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈయనతోపాటు స్థానిక అటవీశాఖ అధికారి తిరుపతిరావు, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement