కుప్పంలో గజరాజుల బీభత్సం | elephants attack crops in kuppam | Sakshi
Sakshi News home page

కుప్పంలో గజరాజుల బీభత్సం

Dec 25 2013 8:20 AM | Updated on Sep 2 2017 1:55 AM

కుప్పంలో గజరాజుల బీభత్సం

కుప్పంలో గజరాజుల బీభత్సం

కుప్పం ప్రాంతంలో వరుసగా నాలుగో రోజూ ఏనుగులు పంట పొలాలపై దాడులు చేశాయి. సోవువారం అర్ధరాత్రి 2.30గంటలకు కూర్మారుునపల్లె గ్రావు సమీపంలో ఏనుగులు దాడులు చేశాయి.

కుప్పం, న్యూస్‌లైన్: కుప్పం ప్రాంతంలో వరుసగా నాలుగో రోజూ ఏనుగులు పంట పొలాలపై దాడులు చేశాయి. సోవువారం అర్ధరాత్రి 2.30గంటలకు మండల పరిధిలోని ఉర్ల ఓబనపల్లె పంచాయుతీ కూర్మారుునపల్లె గ్రావు సమీపంలో ఏనుగులు దాడులు చేశాయి. సువూరు 40 ఏనుగులు  రెండు గుంపులుగా విడిపోయి  పంట పొలాలపై దాడులు చేశాయి. బేటరాయుస్వామి కొండ సమీపంలో ఉన్న సువూరు 10 ఎకరాల పంటలను ధ్వంసం చేశాయి. చెరుకు, టమాట, కంది, వరి పంటలను ధ్వంసం చేశాయి.

రెండు గంటలపాటు ఏనుగులు పంటపొలాపై దాడులు చేశా యి. తెల్లవారు జాము  4 గంటలకు గ్రామస్తులంతా ఏకమై ఏనుగులను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఏనుగుల గుం పు బేటరాయుస్వామి దేవాలయుం సమీపంలోని తమిళనాడు రాష్ట్రానికి చెందిన వుహరాజకడ అటవీ ప్రాంతంలోకి తరలివెళ్లారుు. దాడుల్లో గ్రావూనికి చెందిన క్రిష్ణప్ప, కన్నయ్యుప్ప, వుునిరత్నం, నాగరాజు, శీనప్ప, రాజప్ప, రత్నప్ప, ఇతర రైతులకు చెందిన పంట పొలాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఏనుగులు దాడిచేసిన ప్రాంతాలను సీసీఎఫ్ ఇబ్రహీం, డీఎఫ్‌వో శ్రీకాంత్‌రెడ్డి పరిశీలించారు.
 
పరిహారం అందజేస్తాం

 ఏనుగుల దాడిలో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తామని సీసీఎఫ్ ఇబ్రహీం తెలిపారు. వుంగళవారం స్థానిక ఎమ్మార్సీ భువనంలో ఏనుగులు దాడి చేస్తున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఏనుగుల దాడిలో నష్టపోయిన ఈ ప్రాంత రైతులకు సుమారు రూ. 7 లక్షలు పరిహారం అందించామని జిల్లా పశ్చివు విభాగ అటవీశాఖ అధికారి నీలకంఠనాథ్‌రెడ్డి తెలిపారు.

కుప్పం, గుడుపల్లె వుండలంలోని అటవీ  సరిహద్దు ప్రాం తాల్లో 40 కిలోమీటర్లు వరకు సొలార్ కంచెను నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని ఆయన తెలిపారు. గుడుపల్లె వుండలంలోని  గుడివంక, పెద్దపర్తికుంట గ్రావూల నుంచి కుప్పం వుండలంలోని గుడ్లనాయునపల్లె మీదుగా నడివుూరు ప్రాంతం నుంచి మొట్లచేను అటవీ ప్రాం తం వరకూ సొలార్ కంచెను నిర్మిస్తావున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement