సాక్షి, చిత్తూరు: స్వయానా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఓ అధికారి నిర్వాహకం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి సంబంధించిన ఓ వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేశాడాయన. దీంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
చిత్తూరు జిల్లా సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ వేలాయుధం నెంబర్ నుంచి అధికారిక వాట్సాప్ గ్రూపుల్లో న్యూడ్ వీడియోలు, ఫొటోలు పోస్ట్ అయ్యాయి. దీంతో అందులో ఉన్న జిల్లా అధికారులు, మీడియా ప్రతినిధులు వాటిని చూసి అవాక్కయ్యారు. అయితే ఆ విషయాన్ని డీడీ పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. చాలా సేపు అవి ఆ గ్రూప్‌లో అలాగే ఉండిపోయాయి. అయితే..
మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో కంగారపడ్డ డీడీ.. వాటిని డిలీట్ చేశారు. అయితే ఇది హ్యాకర్ల పనేనని వేలాయుధం చెబుతున్నారు. ఈ వ్యవహారంపై అధికార యంత్రాంగం ఆయన్ని ఆయన్ని వివరణ కోరే అవకాశం కనిపిస్తోంది. సీఎం నియోజకవర్గంలో ఈ పని జరగడంతో చర్చనీయాంశంగా మారింది.



